గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి
– ఎమ్మెల్యేను కలిసిన ఏకగ్రీవ సర్పంచులు
– శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఏకగ్రీవంగా ఎన్నిక అవుతున్న సర్పంచులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోమర్ రెడ్డి అన్నారు. యాలాల మండలంలో ఏకగ్రీవంగా ఎన్నిక అవుతున్న సర్పంచులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిశారు.

సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యాలాల మండలం జక్కపల్లి సర్పంచ్ అభ్యర్థి పెద్దింటి లాలప్ప, సంగెంకుర్దు సర్పంచ్ అభ్యర్థి సుధాలక్ష్మీ, కిష్టాపూర్ సర్పంచ్ అభ్యర్థి పల్లె స్వప్నను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఏకగ్రీవం అవుతున్న సర్పంచు అభ్యర్థులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నిక తరువాత గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యాలాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయా గ్రామాల పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

