సునితాసంపత్ నివాసంలో రక్షాబంధన్
– నాయకులకు, జర్నలిస్టులకు రాఖీ కట్టిన మాజీ చైర్ పర్సన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సునీతా సంపత్ నివాసంలో రాఖీ పౌర్ణమి సందడి నెలకొంది. ఆదివారం రాఖీ పండగ సందర్భంగా సునీతా సంపత్ పలువురుకి రాఖీ కట్టారు.
తాండూరుకు చెందిన సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాస్ చారి, వేణుగోపాల్ రెడ్డి, శెట్టి రవిశంకర్‌లకు సునితాసంపత్ రాఖీ కట్టారు. అనంతరం టీఆర్ఎస్ యువనాయకులకు కూడ ఆమె రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నా చెల్లెల్ల అనుబంధానికి రక్షా బంధన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు.
