వీరశైవ జంగమ సమాజం అభ్యున్నతికి కృషి

తాండూరు రాజకీయం వికారాబాద్

వీరశైవ జంగమ సమాజం అభ్యున్నతికి కృషి
– రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్
– వీరశైవ జంగమ సమాజం సభ్యులకు సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి: వీరశైవ జంగమ సమాజం అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని భద్రేశ్వర దేవాలయంలో ఇటీవల నూతనంగా ఏర్పాటైన వీరశైవ జంగమ సమాజం కార్యవర్గ సభ్యులకు సన్మానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శుభప్రద్ పటేల్ హాజరై సమాజం సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో జంగమ సమాజానికి తగిన ప్రాధాన్యం కల్పించేలా కృషి చేస్తానని అన్నారు. జంగమ సమాజం సభ్యులు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని అన్నారు. వీరశైవ జంగమ సమాజంకు అండగా ఉంటానని అన్నారు. అనంతరం వీరశైవ జంగమ సమాజం నూతన కార్యవర్గ సభ్యులు శుభప్రద్ పటేల్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సమాజం గౌరవాధ్యక్షులు నీలకంఠం స్వామి, అధ్యక్షులు శివకుమార్, ప్రధాన కార్యదర్శి మఠం నిరంజన్ స్వామి, కార్యవర్గ సభ్యులు పరమేశ్వర్ స్వామి, బసప్ప స్వామి, సంతోష్ కుమార్ స్వామి, చందు స్వామి, శుభప్రద్ పటేల్ యువసేన సభ్యులు భాను ప్రసాద్, ఇందూరు కుర్వ బాలు, విజయ్, హరీష్, శ్రీశైలం, సచిన్, నరేష్ గౌడ్, చందు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!