ప్రారంభమైన పైలెట్ గల్లీ పర్యటన
– కోటేశ్వరాలయంలో పూజలు చేసిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి: పట్టణ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన గల్లి గల్లీకి పైలెట్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమయ్యింది. సోమవారం ఉదయం పాత తాండూరులోని కోటేశ్వర దేవాయలంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి టీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం పాత తాండూరులోని వార్డులో గల్లి పర్యటను ప్రారంభించారు. ఈ సందర్భంగా
పాత తాండూరు నాయకులు, ప్రజలు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు రాజుగౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, నాయకులు డాక్టర్ సంపత్‌కుమార్, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, హరిహరగౌడ్, కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, యువనాయకులు సంతోష్ గౌడ్, సంజీవరావు, గుండప్ప, ఎర్రం శ్రీధర్ తదితరులు ఉన్నారు.
