కేసుల రాజీకి సువర్ణ అవకాశం
– 12న జాతీయ మెగా లోక్ అదాలత్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వివిధ కేసులతో ఇబ్బందులు పడుతున్న వారికి ఉపశమనం కలిగించేందుకు న్యాయస్థానం నుంచి సువర్ణ అవకాశం కల్పిస్తున్నారు. ముద్దాయిలు, ఫిర్యాదు దారుల మద్య రాజీ కుదిర్చేందుకు ఈనెల 12న జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తాండూరు పోలీసులు సూచిస్తున్నారు. తాండూరు పట్టణం, తాండూరు సర్కిల్ పరిధిలలో నమోదైన కేసుల్లో నిందితులు, ఫిర్యాదు దారులు అర్జీలు పెట్టుకోవచ్చని తెలిపారు. వరకట్నం, వేధింపులు, డ్రంక్ అండ్ డ్రైవ్, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, నేరం అంగీకారం కేసుల నుంచి రాజీ కుదుర్చుకోవచ్చని చెప్పారు. దీంతో పాటు కరోనా సమయంలో మాస్కులు లేకుండా పట్టుబడిన వారు రూ. 100 జరిమాన కట్టి కేసుల నుంచి విముక్తి పొందవచ్చన్నారు. కేసుల రాజీకోసం కరణ్ కోట పోలీస్ స్టేషన్ సెల్: 99855 48596, పెద్దేముల్ పోలీస్టేషన్ సెల్: 85558 38622, యాలాల పోలీస్టేషన్ సెల్: 90106 26280, బషీరాబాద్ పోలీస్ స్టేషన్ సెల్: 957355 9607లకు సంప్రదించవచ్చని తెలిపారు.


