ఇర్ఫాన్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ టీఆర్ఎస్ పట్టణ నాయకులు ఇర్ఫాన్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పరామర్శించారు. బుధవారం ఇర్ఫాన్ తండ్రి. బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగి మన్నన్ కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కుమ్మరి గల్లిలోని ఇర్ఫాన్ నివాసానికి చేరుకున్నారు. ఇర్ఫాన్ తండ్రి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆధైర్య పడొద్దు.. అండగా ఉంటామని ఇర్ఫాన్‌కు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి భరోసా ఓదార్పునిచ్చారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, టీఆర్ఎస్ పట్టణ అపూ(నయూం), టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, పద్దోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారీ, రాజుగౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, నాయకులు నర్సిరెడ్డి తదితరులు ఉన్నారు.

