పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించాలి
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: బాలింత, గర్భిణీలు, చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించాలని తాండూరు మున్సిపల్ వైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణం ధనగర్ గల్లీలోని అంగన్ కేంద్రాన్ని చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రంలో మహిళ దినోత్సవంను పురస్కరించుకుని చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు. అదేవిధంగా మహిళలకు శ్రీమంతం నిర్వహించారు. అనంతరం చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ బాలింతలు, గర్భిణీలకు, చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం అంగన్ వాడి కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించాలని అంగన్ వాడి టీచర్లను ఆదేశించారు. చిన్నారులకు గుణాత్మక విద్యను అందించేలా చూడాలన్నారు. అనంతరం చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌తో పాటు బీజేపీ ఫ్లోర్ లీడర్ నరుకుల సిందూజ నరేందర్ గౌడ్‌లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంగన్ టీచర్, ఆయా, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.


