కాగ్నా రంద్రంపై కాంగ్రెస్ రాద్ధాంతం..!
– ప్రజలను మభ్యపెట్టేందుకు కుట్ర
– బ్రిడ్జి మరమ్మత్తుల బాధ్యత ఎమ్మెల్యేదే
– కాంట్రాక్టర్ నుంచి మనీ రికవరీ చేయాలి
– కమీషన్లతోనే హైదరాబాద్ రోడ్డు కాంట్రాక్టు
– రోడ్లపై బీజేపీ మాట్లాడడం విడ్డూరం
– జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాగ్నానదిపై ఏర్పడిన రంద్రంపై కాంగ్రెస్ పార్టీ రాద్ధాంత రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ ద్వజమెత్తారు.

సోమవారం తాండూరుపట్టణంలోని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాగ్నానదిపై ఏర్పడిన రంద్రం విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గంలో దాదాపు 3800 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. మాజీ మంత్రి హరిశ్ రావు సహాకారంతో కాగ్నానదిపై కొత్త వంతెన నిర్మాణానికి రూ.18లక్షలు మంజూరు చేశారని గుర్తుచేశారు. దీంతో పాటు జీవన్నీ పేర్కంపల్లి, ముద్దాయి పేట్, బుద్దారం, గాజీపూర్, బెల్కటూర్, కోకట్ తదితర ప్రాంతాల్లో బ్రిడ్జిలను మంజూరు చేసిందన్నారు. కాగ్నానది బ్రిడ్జి వంతెన పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్ ద్వారా పనులు చేపట్టారని అన్నారు. ఈ విషయం తెలిసినా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాంట్రాక్టర్ ను బ్లాకు లిస్టులో పెట్టి.. మనీ రికవరీ చేయించాలని డిమాండ్ చేశారు.

కాగ్నానదిపై ఏదైనా ప్రమాదం జరిగితే ఎమ్మెల్యే గారిదే పూర్తి బాధ్యత అని అన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ నుంచి ప్రత్యేక నిధులతో కాగ్నానది బ్రిడ్జికి మరమ్మత్తులు చేయించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ చేపట్టిన కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ రాద్దాంతం చేసి అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఇప్పుడు తాండూరులో కాగ్నానది బ్రిడ్జి రంద్రంపై కూడా స్థానిక కాంగ్రెస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల ఊసు ఎత్తకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు రాజకీయ కుట్ర చేస్తోందని అన్నారు. గతంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ద్వారా మంజూరైన తాండూరు హైదరాబాద్ రోడ్డు విషయంలో కాంట్రాక్టర్ ముందుకు రాలేదని అన్నారు.

ఈ పనులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ హాయాంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకే పనులు అప్పగించారని అన్నారు. ఆ కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు పొంది పనులు చేస్తున్నారనే విషయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కమీషన్లు ఎవరు తీసుకుంటున్నారో అర్ధమవుతోందని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ములాఖత్ అయిన బీజేపీ రోడ్లపై మాట్లాడడం విడ్డూరంగా ఎందని ఎద్దేవా చేశారు. గతంలో కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులపై మద్దుగా మాట్లాడిన బీజేపీ నేతలు. రాహుల్ గాంధీ వ్యతి రేకించడంతో వారికి మద్దతుగా బీజేపీ నిలవడం గమనిస్తున్నారని అన్నారు. కాగ్నానదిపై బ్రిడ్జి వంతెన నిర్మాణ సమయంలో ఎంపీపీగా ఉన్న బాలేశ్వర్ గుప్తకు నిర్లక్ష్యం ఇప్పుడు గుర్తుకొచ్చిందా.. ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఇదికూడా చదవండి..

