10 నుంచి 10వ‌ర‌కే మ‌ద్యం అమ్మ‌కాలు

క్రైం తాండూరు వికారాబాద్

10 నుంచి 10వ‌ర‌కే మ‌ద్యం అమ్మ‌కాలు
– వైన్స్ షాపుల్లో లూజ్ లిక్కర్ అమ్మితే చర్యలు
– ఎక్సైజ్ జిల్లా అసిస్టెంట్ సూపరిండెంట్ మల్లా రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: వైన్స్ షాపుల్లో ఉద‌యం 10గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కే మ‌ద్యం అమ్మ‌కాలు చేప‌ట్టాల‌ని, లేదంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరిండెంట్ మల్లారెడ్డి పేర్కొన్నారు. బుధవారం తాండూరు ప్రొహిబిషన్ ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 59 వైన్స్ షాపులు, 8 బార్లు ఉన్నాయని తెలిపారు. వైన్స్ షాపులు, లిక్కర్ షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగించాలని అన్నారు. ప్రతి వైన్ షాపుకు అనుబంధంగా పర్మిట్ రూంలకు కూడ ఇదే నిబంధన వర్తిస్తుందన్నారు. వైన్స్ షాపుల్లో లూజ్ మద్యం తీసుకుని పర్మిట్ రూంలో మాత్రమే సేవించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా లూజు మద్యం విక్రయాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా పర్మిట్ రూంలో తాగునీటి వసతిని వైన్స్ షాపుల యజమానులు కల్పించాలని, తినుబండారాలను ఉంచాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి చర్యలకు పాల్పడినా కూడ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఎక్సైజ్ సీఐ తుక్యానాయక్, సిబ్బంది ఉన్నారు.
ఈ వార్త‌ను స‌మ‌ర్పించిన వారు