మందు బాబులకు బ్యాడ్‌ న్యూస్‌..!

తెలంగాణ రాజకీయం హైదరాబాద్

మందు బాబులకు బ్యాడ్‌ న్యూస్‌..!
– తెలంగాణలో పెరగనున్న బీర్ల ధరలు
– ఎందుకోసం పెరుగుతున్నాయంటే..?
హైదారాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలోని మందుబాబులకు సర్కారు బ్యాడ్‌ న్యూస్ చెప్పబోతోంది. రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆరు బ్రూవరీల్లో ఏటా 68 కోట్ల లీటర్ల బీరు తయారు అవుతోంది. ఆ బీరును తెలంగాణ రాష్ట్రంబేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీఎ్‌సబీసీఎల్‌) కొనుగోలుచేసి.. మద్యం దుకాణాలకు సరఫరా చేస్తోంది. ఈ నేపథ్యంలో 12 బీర్ల కేసుకుగాను బ్రూవరీలకు టీఎస్‌బీసీఎల్‌ రూ.289 చెల్లిస్తోంది. పన్నులన్నీ కలుపుకొని కేసుకు రూ.1400 చొప్పున రిటైలర్లకు (మద్యం దుకాణాలు) విక్రయిస్తుండగా.. ఇతర ఖర్చులన్నీ కలిపి మద్యం దుకాణాలవారు కేసు రూ.1800 చొప్పున విక్రయిస్తున్నారు.

బీర్ల తయారీ కేంద్రాల (బ్రూవరీల)కు ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను 10 నుంచి 12 శాతం మేర పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ భారం వినియోగదారులపైనే పడనుంది. అంటే.. ఒక్కో బీరునూ ప్రభుత్వం బ్రూవరీల వద్ద రూ.24.08కి కొనుగోలు చేసి రూ.116.66కి మద్యం దుకాణాలకు విక్రయిస్తుండగా.. వినియోగదారుడి వద్దకు వచ్చేసరికి ఒక్కో బీరు ధరా రూ.150 అవుతోంది. రాష్ట్రంలో బీర్ల డిమాండ్‌కు తగ్గట్టు ప్రభుత్వ ఆర్డర్లపై బ్రూవరీలు బీర్లను ఉత్పత్తి చేస్తాయి.

ఇదికూడా చదవండి…

పానం పోయినా పాలే ముఖ్యం..!