కోట్రికకు నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి

తాండూరు రాజకీయం వికారాబాద్

కోట్రికకు నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి
– మాజీ చైర్ ప‌ర్స‌న్ కుటుంబానికి ప‌రామ‌ర్శ‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మున్సిప‌ల్ మాజీ చైర్ ప‌ర్స‌న్ కోట్రిక విజ‌య‌ల‌క్ష్మీ భ‌ర్త‌, టీఆర్ఎస్ సీనీయ‌ర్ నాయ‌కులు, సేవారత్న అవార్డు గ్ర‌హీత స్వ‌ర్గీయ కోట్రిక వెంక‌ట‌య్య‌కు ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి నివాళులు అర్పించారు. కోట్రిక వెంక‌ట‌య్య 5వ వ‌ర్దంతి సంద‌ర్భంగా ఆదివారం ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి మున్సిప‌ల్ మాజీ చైర్ ప‌ర్స‌న్ కోట్రిక విజ‌య‌ల‌క్ష్మీ కుటుంబాన్ని ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా కోట్రిక వెంక‌ట‌య్య చిత్ర‌ప‌టానికి ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం మాజీ చైర్ ప‌ర్స‌న్ కోట్రిక విజ‌య‌ల‌క్ష్మీ కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడారు. వారి యోగ‌క్షేమాల‌ను తెలుసుకుని కోట్రిక వెంక‌ట‌య్య అందించిన సేవల‌ను ఈ సంద‌ర్భంగా గుర్తుచేసుకుని కొనియాడారు. ఎమ్మెల్సీ వెంట టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, మాజీ డీపీసీ స‌భ్యులు పట్లోళ్ళ నర్సింలు, నాయకులు సాయిపూర్ పట్లోళ్ళ బాల్ రెడ్డి, యువ‌నాయ‌కులు బి.రఘు,అశోక్ మంతన్ గౌడ్,TRSV జిల్లా అధికార ప్ర‌తినిధి దత్తాత్రేయ, శ్రీనివాస్ గౌడ్, కోట్ల రాజు, సిద్దు పంతులు తదితరులు ఉన్నారు.