వాసవీ మాత వైభోగం..!
– తాండూరులో ఘనంగా జయంతి ఉత్సవాలు
– అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, క్షీరాభిషేకం
-దర్శించుకున్న సంఘాల నాయకులు, భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ మాత వైభోగం సంతరించుకుంది. శనివారం తాండూరు పట్టణంలో వాసవీ మాత జయంతి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆర్యవైశ్య సంఘం, శ్రీ నగరేశ్వర దేవస్థాన పాలక మండలి, వాసవీ మహిళ సంఘం, ఆర్య వైశ్య సేవాదళ్ యువజన సంఘం, వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, నగరేశ్వర భజన మండలిల ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను నిర్వహించారు.
జయంతి సందర్భంగా పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో వెలసిన శ్రీ వాసవీ మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపం నుంచి నగరేశ్వర దేవాలయం వరకు అమృత కళశములతో నిర్వహించిన ఊరేగింపు కన్నుల పండగగా కొనసాగింది. అనంతరం ఆలయంలో కన్యకా పరమేరశ్వరీ మాతకు క్షీరాభిషేకం, జలాభిషేకం, కుంకుమార్చన, డోలారోణ కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించారు. మధ్యాహ్నం మహాప్రసాదం, సాయంత్రం కన్యకాపరమేశ్వరి శోభాయాత్ర చేపట్టారు.

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అలంపల్లి శ్రీనివాస్, కార్యదర్శి కోడూరు వినోద్ కుమార్, ఉపాధ్యక్షులు ఆకారపు శివకుమార్, కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్, సహ కార్యదర్శి కుంచం సంపత్ కుమార్, నగరేశ్వర దేవాలయ పాలకమండలి చైర్మన్ కుంచెం మురళీధర్, వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మి శ్రీకాంత్, కార్యదర్శి మంకాల స్వప్న రాఘవేందర్, కోశాధికారి సింగంశెట్టి శోభారాణి, ఆర్యవైశ్య జిల్లా సేవాదళ్ అధ్యక్షులు గుబ్బ నరేష్ కుమార్, కార్యదర్శి కట్కం హరీష్, కోశాధికారి చీకటిమర్ల పునీత్,

ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు తర్లపల్లి భానుకుమార్, కోశాధికారి కల్వ రాజవంశి, వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు రెడ్డిశెట్టి సతీష్, కార్యదర్శి చల్లా గుణవర్దన్, కోశాధికారి చల్లా వినయ్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు కల్వ జగదీష్, కార్యదర్శి గుడుపల్లి ప్రణ్, కోశాధికారి కల్వ సాయితేజ, నగరేశ్వర భజన మండలి అధ్యక్షులు తర్లపల్లి సుధాకర్, కోశాధికారి గూళీ భద్రీనాథ్, కోశాధికారి దిర్శంపల్లి శ్రీనివాస్, ఆయా సంఘాల సభ్యులు, మహిళలు, భక్తులు. పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

