పంచాయతీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్లు..!

జాతీయం తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

పంచాయతీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్లు..!
– విచారణను వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం
– దాఖలు చేసిన కారణాలు ఏమంటే..?
– నామినేషన్ల స్వీకరణపై ఉత్కంఠ
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో ఫిటీషన్లు దాఖలయ్యాయి. మొత్తం 9 ఫిటీషన్లను దాఖలు అయ్యాయి.

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం రామసానిపల్లికి చెందిన మాజీ సర్పంచి ఆగమయ్య, కల్వకుర్తి నియోజకవర్గంలో వెల్దండ మండలం తిమ్మనోనిపల్లి నుంచి రిజర్వేషన్లపై మరో పిటిషన్ దాఖలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జీవోకు విరుద్ధంగా రిజర్వేషన్లు కేటాయిస్తున్నారంటూ ఫిటిషన్లలో పేర్కొన్నారు. పిటీషనర్ల తరుపునుంచి న్యాయవాదులు వాదనలు వినింపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకు బీసీ రిజర్వేషన్లు 17శాతం మాత్రమే ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 46కు విరుద్ధంగా ఈ రిజర్వేషన్లు ఉన్నాయని అందులో హైకోర్టు దృష్టికి తీసుకవచ్చారు.

2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు సర్పంచుల రిజర్వేషన్లు కేటాయించినట్లు ఫిటిషనర్ తరపు న్యాయవాదులు తెలిపారు. రోస్టర్ ప్రకారం రిజర్వేషన్లు మారుతూ వస్తాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. 2011 జనాభా గణనలో తప్పులున్నట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తున్నారని.. దీనికి కేంద్రమే సమాధానం చెప్పాల్సి ఉందని వాదనలు జరిగాయి. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు జరుతుతున్నాయి. పంచాయతి ఎన్నికలపై హైకోర్టులో పిటీషన్లు దాఖలు కావడంతో నామినేషన్ల స్వీకరణపై ఉత్కంఠత ఏర్పడింది.

ఇదికూడా చదవండి…

అక్రమ రవాణాపై కన్నెర్ర..!