కేంద్ర ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లండి

తాండూరు రాజకీయం వికారాబాద్

కేంద్ర ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లండి
– బీజేపీ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి యు.ర‌మేష్ కుమార్
తాండూరు, దర్శిని ప్ర‌తినిధి: దేశంలో కేంద్ర ప్ర‌భుత్వం ప్రవేశ పెట్టిన కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి చైత‌న్య ప‌ర‌చాల‌ని బీజేపీ వికారాబాద్ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి యు.ర‌మేష్ కుమార్ అన్నారు. సోమ‌వారం తాండూరు ప‌ట్ట‌ణంలోని బీజేపీ కార్యాల‌యంలో ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు సుద‌ర్శ‌న్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి యు.ర‌మేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ తాండూరు ప‌ట్ట‌ణ కోశాధికారిగా పోల శ్రీ‌నివాస్, ప‌ట్ట‌ణ మ‌హిళ మోర్చ అధ్య‌క్షురాలుగా ఎన్. ఉమాదేవిల‌ను నియ‌మించారు. యు.ర‌మేష్ కుమార్ వారిని నియామ‌క‌ప‌త్రాల‌ను అంద‌జేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ కేంద్ర పప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథ‌కాలు ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి చైత‌న్య ప‌ర‌చాల‌న్నారు. పార్టీ బ‌లోపేతానికి నిరంత‌రం కృషి చేయాల‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు బీజేపీ ప‌ట్ట‌ణ కోశాధికారిగా నియామ‌క‌మైన పోల శ్రీ‌నివాస్, మ‌హిళ మోర్చ అధ్య‌క్షురాలు ఉమాదేవిలు యు.ర‌మేష్ కుమార్, సుద‌ర్శ‌న్ గౌడ్‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రామ్య నాయక్, మ‌హిళ మోర్చ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యురాలు అంతారం ల‌లిత‌(కౌన్సిల‌ర్‌), మ‌హిళ మోర్చ వికారాబాద్ జిల్లా అధ్య‌క్షురాలు సాహు శ్రీ‌ల‌త‌(కౌన్సిల‌ర్), పట్టణ ప్రధాన కార్యదర్శి దోమ కృష్ణ, పట్టణ కార్యదర్శులు చందు,శివాజీ త‌దిత‌రులు పాల్గొన్నారు.