మద్యం మత్తులో ఈతకు వెళ్లి
– బావిలో దూకిన యువకుడు మృతి
– మృతదేహాన్ని వెలికి తీసిన ఫైర్ సిబ్బంది
– పాత తాండూరులో సంఘటన
తాండూర, దర్శిని ప్రతినిధి: మద్యంతో మత్తులో ఈత కొట్టేందుకు బావిలో దూకిన ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన తాండూరు మున్సిపల్ పరిధి పరిధి పాత తాండూరులో చోటు చేసుకుంది. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామానికి చెందిన ఆది(25) పాత సమాన్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం పాత తాండూరు గడి సమీపంలోని ఓ బావిలో ఈత కొట్టేందుకు దూకాడు. ఎంతకీ పైకీ రాకపోవడంతో స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి ద్వారా విషయం తెలుసుకున్న తాండూరు ఫైర్ ఆఫీసర్ నాగార్జున సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది వద్ద ఉన్న పాతాళకాంటతో ఆది మృతదేహాన్ని వెలికి తీశారు. అప్పటికే ఆది మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు వాపోయారు. మృతదేహాన్ని వెలికి తీసిన ఫైర్ అధికారులు పోలీసులకు అప్పగించారు. కుటుంబ సభ్యులకు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

