రంజాన్ సంతోషం పంచిన శుభప్రద్ పటేల్
– శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభ్రపద్ పటేల్ తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండల ముస్లిం సోదరులకు రంజాన్ పండగ సంతోషాన్ని పంచారు. శుక్రవారం పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన జర్నలిస్ట్ గౌస్ నివాసానికి చేరుకున్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని సమ్మేళనంలో పాల్గొన్న ముస్లిం సోదులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారితో కలిసి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టు గౌస్ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభ్రప్రద్ పటేల్‌ను ముస్లిం సంప్రదాయ పద్దతిలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ గయాజ్, నాయకులు బాను, అన్వర్, యువకులు మీనాజ్, అశ్రాఫ్, పర్వేజ్ తదితరులు ఉన్నారు.


