రేపు విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం

తాండూరు వికారాబాద్

రేపు విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం
– ఉద‌యం 8 నుంచి మ‌ధ్యాహ్నం 2 వ‌ర‌కు నిలిపివేత
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: రేపు ఆదివారం తాండూరు మున్సిపల్ లో విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంతరాయం విధిస్తున్న‌ట్లు తాండూరు విద్యుత్ డీఈ వెంక‌న్న‌ ఓ ప్ర‌క‌ట‌లో తెలిపారు. తాండూరు మున్సిపల్ లోని అన్ని వార్డులలో ఆదివారం ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌ వ‌ర‌కు విద్యుత్ స‌రఫ‌రాను నిలిపివేయ‌డం జ‌రుగుతుందాన్నారు. 33, 11 కేవీ లైన్లలో నిర్వ‌హ‌ణ ప‌నుల‌ను దృష్టిలో ఉంచుకుని అంత‌రాయం విధిస్తున్న‌ట్లు వివ‌రించారు. కావున వినియోగ‌దారులు విద్యుత్ అంత‌రాయానికి స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.