మహాలక్ష్మీ మేలు..!
– మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
– ఆరు గ్యారెంటీల అమలుకు సర్కారు ప్రాధాన్యం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ సర్కారు ప్రవేశ పెట్టిన మహాలక్ష్మీ పథకంతో మహిళలకు మేలు జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు ఆర్టీసీ డిపోలో డీఎం సమతారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహాలక్ష్మీ పథకాన్ని జెండా ఊపి పథకాన్ని ప్రారంభించారు. బస్సులో ఎక్కి వివిధ గమ్యస్థానాలకు బయల్దేరిన మహిళలకు జీరో టికెట్ ను అందజే శారు. అంతకుముందు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత సెప్టెంబర్ మాసంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ప్రజల కోసం ఆరు గ్యారెంటీ ప థకాలను ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.
అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామి మేరకు ఆరు గ్యారెంటీలలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పతకంతో పేదలకు చేయూత అందించడంతో పాటు మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. మిగత పథకాలను కూడా కాంగ్రెస్ పార్టీ కమిట్ మెంట్ తో అమలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత ప్రయాణం పథకాన్ని మహిళలందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, ఎంపీపీలు అనితా రవీందర్ గౌడ్, కరుణ అజయ్ ప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునితా సంపత్, కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, అబ్దుల్ రజాక్, ప్రభాకర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, జిల్లా అధ్యక్షురాలు శోభారాణి, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, అజయ్ ప్రసాద్, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్, టీజేఎస్ ఇంచార్జ్ సోమశేఖర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

