మద్యం బాటిళ్ల పట్టివేత
– తరలిస్తున్న వ్యక్తిపై కేసు
– వెల్లడించిన తాండూరు పోలీసులు
– ఎన్ని బాటిళ్లు పట్టుకున్నారంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి మద్యం బాటిళ్లను స్వాదీనం చేసుకున్నారు. ఈ సంఘటన శనివారం తాండూరు పట్టణ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద శనివారం మధ్యాహ్నం ఎస్ కే సలీం అనే వ్యక్తి అక్రమంగా మద్యం బాటిళ్లు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
అతన్ని పరిశీలించగా బీరు సీసాలతో పాటు పుల్ బాటిళ్లు, క్వాటర్ బాటిళ్లతో కలిపి మొత్తం 16 లీటర్ల బాటిళ్లను పట్టుకున్నారు. ఈ మేరకు అతన్ని అదుపులోకి తీసుకోవడంతో పాటు కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మద్యం బాటిళ్లు తరలించడం కాని, విక్రయాలకు పాల్పడడం జరిగితే కేసులు తప్పవని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి…

