రక్షా బంధన్‌లో హిందూ వాహిని మార్క్..!
– అధికారులకు, నేతలకు రాఖీలు కట్టిన మహిళలు
– ఆదర్శనీయంగా రక్షాబంధన్ సంబరాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో రాఖీ పండగ సంబరాలు అంబరాన్నంటేలా జరుపుకున్నారు. శనివారం తాండూరు నియోజకవర్గంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో రక్షాబంధన్ సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

హిందూ వాహినికి చెందిన మహిళ సభ్యులు స్థానిక అధికారులకు, నాయకులకు రాఖీలు కట్టారు. రాఖీ పండగ సందర్భంగా ప్రజల శాంతిభద్రతతో నిత్యం బిజీగా ఉండే పోలీసులకు రాఖీ కట్టారు. పట్టణ సీఐ సంతోష్ కుమార్‌కు, ఎస్‌లు, సిబ్బందికి రాఖీలు కట్టి పండగ శుభకాంక్షలు తెలిపారు. అదేవిధంగా అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీ యువనాయకులు బిడ్కర్ రఘుకు కూడా రాఖీలు కట్టారు.

అనంతరం పట్టణంలోని పలువురు అధికారులకు, రాజకీయ నాయకులకు, హిందూ సంఘాల సభ్యులకు రాఖీలు పండగ పండగ సంబరాలలో సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పారు. నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష అంటూ అనురాగాల పూలు పూయించారు. హిందూ వాహిని ఆధ్వర్యంలో జరిగిన రక్షాబంధన్ వేడుకలు ప్రత్యేకతను చాటుకున్నాయి.

ఇదికూడా చదవండి…

