సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య
– బీజేపీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : సర్కారు బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని తాండూరు మున్సిపల్ పరిధి 20వ వార్డు బీజేపీ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. శనివారం గాంధీనగర్ లోని ప్రాథమిక పాఠశాలలో ప్రోఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల బోధనను ప్రవేశ ప్రారంభమ అవుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని అన్నారు. సర్కారు బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మాధవి, రాణి, అంగన్ వాడి టీచర్ రాధ, ఆర్పీ శోభ, ఎఎన్ఎం మాధవి, ఆశ వర్కర్ సుజాత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


