తాబేళ్ల తెలివి సల్లంగుండా…!
– నీటీ ఏనుగుపై సవారీ చేసిన తాబేళ్ల మంద
– నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో
దర్శిని ప్రతినిధి: కొన్ని జంతువులను చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఇక అవి చేసే అల్లరి గురించి చెప్పనే అక్కర్లేదు. వాటి తెలివితేటలు చూస్తే అమోఘం అనిపిస్తుంటాయి. మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిపంచే జంతువులు మనుషులతో ఇట్టే కలిసిపోతుంటాయి. ఇటీవల కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని భయంకరంగా కనిపిస్తే.. మరికొన్ని ఎంతో చూడముచ్చటగా కనిపిస్తుంటాయి. పాములు, కోతులు, పులుల, చిరుతలు, సింహాలు, నెమలి ఇలా ఒక్కటేమిటి.. దాదాపు అన్ని రకాలు పక్షులు, జంతువుల చేష్టలకు ఉప్పోంగిపోతాం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటున్నారా.. తాజాగా తాబేళ్లకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అడవిలోని ఓ నీటి కొలనులో భారీ నీటీ ఏనుగు ఒకటి హాయిగా సేద తీరుతోంది..అయితే, అదే కొలనులో ఉన్న తాబేళ్లు..మందకు మందగా వచ్చి నీటి ఏనుగును చుట్టుముట్టాయి. వీపుపైకి ఎక్కేసి..ఎంచక్కా స్వారీ చేస్తున్నాయి. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రామన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కాగా, వీడియోను నెటిజన్లు ఎంతగానో లైక్ చేస్తున్నారు. తాబేళ్ల తెలివికి ఇది నిదర్శనం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Sometimes free rides can get risky
🎥#shared pic.twitter.com/povlvQ3TB3
— Sudha Ramen 🇮🇳 (@SudhaRamenIFS) August 21, 2021