శాంతి సమాజానికి తోడ్పడాలి

తాండూరు వికారాబాద్

శాంతి సమాజానికి తోడ్పడాలి
– అనవసర వివాదాల జోలికి పోవద్దు
– ఫోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
– తాండూరు డీఎస్పీ జి. శేఖర్ గౌడ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: శాంతియుత సమాజానికి అందరు తోడ్పాటు అందించాలని తాండూరు డీఎస్పీ జి.శేఖర్ గౌడ్ అన్నారు. ఆదివారం తాండూరు మున్సిపల్ పరిధి ఇందినగర్ గుండుపేర్లు సమీపంలో డీఎస్పీ శేఖర్ గౌడ్ స్థానిక పెద్దలు, యువతతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలు పోలీసులతో సత్సంబంధాలు అలవర్చుకోవాలన్నారు. ప్రజలు, యువకులు అనవసర వివాదాల జోలికి వెళ్లదన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే సందేశాలు ఇవ్వరాదన్నారు. దానివల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందన్నారు. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా చదువుపై దృష్టిసారించాలన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు పోక్సో చట్టంపై ఆగాహన పెంచుకోవాలన్నారు. అంద‌రు శాంతియుత స‌మాజాన్ని తోడ్పాటు అందించాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, కౌన్సిలర్ అస్లాం, నాయకులు బోయరాజు, సలీం, మౌలానా, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.