అన్నదాన సేవకు ప్రాధాన్యం

తాండూరు వికారాబాద్

అన్నదాన సేవకు ప్రాధాన్యం
– ప్రతి పౌర్ణమికి పేదలకు అన్నదానం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: దైవ సేవతో పాటు పేదల అన్నదాన సేవకు ప్రాధాన్యమివ్వడం జరుగుతుందని నగరేశ్వర దేవాలయ పాలక మండలి, ఆర్యవైశ్య సంఘం సభ్యులు పేర్కొన్నారు. సోమవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఆలయ పాలక మండలి, ఆర్యవైశ్య సంఘం, ఆలయ భజన మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ చైర్మన్ కుంచెం మురళిధర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కట్కం ఏరేందర్, భజన మండలి సభ్యులు పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నగరేశ్వర దేవాలయం వద్ద ప్రతి పౌర్ణమికి దైవ కార్యక్రమాలతో పాటు అన్నదాన సేవకు ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలకు అన్నదానం చేయడంలో దైవ సంతృప్తి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు అలంపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కోట మురళీకృష్ణ, సభ్యులు కోట్రిక కిరణ్, ద‌త్తు, అనిల్, హ‌రిష్, భ‌జ‌న మండ‌లి స‌భ్యులు తదితరులు పాల్గొన్నారు.