‘విలన్‌ఆఫ్‌పుష్ప’
ఫహద్ ఫస్ట్‌లుక్ చూస్తే
దర్శిని ప్రతినిధి: ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో క్రియోటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ‘పుష్ప’ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవలే ఫహద్ ‘పుష్ప’ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఒకవైపు షూటింగ్ జరుపుతూనే మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఫహద్ లుక్‌ను చిత్రబృందం వదిలింది. ‘విలన్‌ఆఫ్‌పుష్ప’ పేరుతో ఫహద్ ఫస్ట్‌లుక్‌ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఇందులో ఆయన ‘భన్వర్ సింగ్ షెకావత్’ అనే పోలీస్ అధికారిగా కనిపించబోతున్నట్టు వెల్లడించారు. కంటిచూపుతోనే అందరినీ వణికించే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నట్టు తాజాగా వదిలిన ఫహద్ ఫస్ట్‌లుక్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందనుండగా, ‘పుష్ప ది రైజ్’ పేరుతో మొదటి భాగాన్ని ఈ ఏడాది క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
