ఫలితాల పట్టువదలొద్దు..!
– ఉత్తీర్ణతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి..
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: పరీక్షలలో ఉత్తీర్ణత సాధించేందుకు బిగించిన పట్టుదలతో విద్యార్థులు వదలకుండా ముందుకు సాగాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని విద్యార్థులను అభినందించి సన్మానించారు. ప్రతి ఒక్కరినీ ఎమ్మెల్యే పరిచయం చేసుకున్నారు. విద్యార్థుల నేపథ్యాన్ని అడిగి తెలుసుకుని మరింత రాణించాలని ప్రోత్సహించారు. ఏం కావాలన్నా తాను అండగా సహయంగా ఉంటానని విద్యార్థులతో ఎమ్మెల్యే హామి ఇచ్చారు. ఫలితాలు సాధన కోసం విద్యార్థులు బిగించిన పట్టుదలను కొనసాగించాలని పేర్కొన్నారు
. మరోవైపు విద్యార్థులకు అభిందన కార్యక్రమం ఏర్పాటుకు చేసిన పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, మహేశ్వర్ రెడ్డి, చంటి తదితరులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నర్సింలు, నియోజకవర్గ పార్టీ అధికార ప్రతినిధి రాజు గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు నయ్యుం అఫు, నాయకులు శ్రీనివాస్ చారి, నర్సింలు, ఎంపిటిసి ప్రవీణ్ పటేల్ తదితరులు ఉన్నారు.



