రైతు దార్శనికుడు సీఎం కేసీఆర్

తాండూరు తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

రైతు దార్శనికుడు సీఎం కేసీఆర్
– రైతుల ఆశీస్సులే శ్రీరామ రక్ష
– రైతుబంధు ఘనత తెలంగాణకే సొంతం
– రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి
– వారోత్సవాలలో పాల్గొన్న మంత్రి సబితారెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణలో రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న దార్శనీకుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వల్లా జైళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు టీఆర్ఎస్ నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటి శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ రైతుబంధు వారోత్సవాలలో మంత్రి సబితా రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎడ్ల‌బండి, ట్రాక్ట‌ర్ల‌ ర్యాలీ ద్వారా పట్టణంలోని రైతుబజార్లో ఏర్పాటు చేసిన వారోత్సవాలకు సంబ‌రాల వ‌ద్ద‌కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ రైతుల కళ్లల్లో సీఎం కేసీఆర్ సంతోషం నింపారనే విషయాన్ని రైతుబంధు వారోత్సవాలు అద్దం పడుతున్నాయని అన్నారు.
గతంలో కరెంటు కోతలతో.. మద్దతు ధరలు లేక రైతులు అల్లాడుతుంటే ఎవ్వరు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి కృషి చేశారని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఎకరానికి ఏడాదికి రూ. 10వేల ఆర్థిక సహాయం అందించి రైతులకు భరోసాగా నిలిచారని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కి దక్కుతుందన్నారు. రైతుబంధు, రైతుబీమాతో పాటు కల్లాలు నిర్మాణం. రైతునే ధికలు, విత్తనాల కొరత లేకుండా వంటి కార్యక్రమాలతో రైతు దార్శనీకుడుగా మారారని పేర్కొన్నారు. కేంద్రం ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించకున్నా రూ.లక్ష కోట్లతో కేవ‌లం మూడేళ్ల‌లో అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రైతుల పొలాలకు సాగునీరు అందించారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఏంచేసిందని అడిగేవాళ్లు రైతులను అడిగితే చెబుతారని అన్నారు. ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసిన సీఎం కేసీఆర్ నుంచి రైతులను, తెలంగాణ ప్రజలను ఎవ్వరు విడదీయలేరని అన్నారు. రైతుల ఆశీస్సులే సీఎం కేసీఆర్కు శ్రీరామ రక్షగా నిలుస్తాయన్నారు.

రైతు సంక్షేమానికి పెద్ద పీట: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
అదేవిధంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. రైతుబంధు ద్వారా రైతులందరికి ప్రభుత్వం రూ.50 వేల నిధులు మంజూరు చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రైతు వేధికలు, పంటలకు మద్దతు ధర, సాగునీరు వంటి కార్యక్రమాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. రానున్న రోజుల్లో కూడ రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, డాక్టర్ సంపత్ కుమార్, రాజుగౌడ్, పల్లెళ్ నర్సింలు, శ్రీనివాసాచారి. పట్టణ అధ్యక్షులు అపూ(నయూం), వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ గోపాల్, తాండూరు మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజకుమారి, మార్కెట్ కమిటి డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటి అధికారులు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.