జిల్లాలో ప్రజావాణి రద్దు
– ప్రకటించిన కలెక్టర్ కె.నిఖిల
– రావద్దని ప్రజలకు సూచన
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : ప్రతి వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిని రద్దుచేసినట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల ప్రకటించారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా రేపు సోమవారం నాటి ప్రజావాణిని వాయిదా వేసినట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు కురుస్తుండడంతో జిల్లాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కావున ప్రజలు జిల్లా కేంద్రానికి రావద్దని సూచించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసర పనులకు తప్ప ఇండ్లలోనే సురక్షితంగా ఉండాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తరువాత ప్రజావాణిని మళ్లీ పునః ప్రారంభిస్తామన్నారు. అప్పటి వరకు ఈ విషయాన్ని ప్రజలు గనమించాలని సూచించారు.



