విద్యతో పాటు ఉపాధి కల్పనకు కృషి

కెరీర్ తాండూరు వికారాబాద్

విద్యతో పాటు ఉపాధి కల్పనకు కృషి
– సింధూ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ విజయాదేవి
– క్యాంపర్ సెలక్షన్స్ కు విశేష స్పందన
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : విద్యతో పాటు యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందని తాండూరు సింధూ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ విజయాదేవి అన్నారు. శుక్రవారం కళాశాలలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనుబంధ సంస్థలు విప్రో, బైజ్యూస్, మూత్తూట్ ఫైనాన్స్, టేక్ మహీంద్ర, 5కే కార్ సర్వీస్, కేఫ్ కాఫీడే, స్కైయాడ్ ఎలక్ట్రానిక్స్, విజయ బయో ఫర్టిలైజర్స్, హనర్స్ ల్యాబ్, హెచ్ డీఎఫ్సీ, ఎస్బీఐ ద్వారా విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వచి హించారు. ఈ సెలక్షన్స్ కు విద్యార్థుల నుంచి భారీ స్పందన లభించింది. మొత్తం 150 మంది విద్యార్థులకు ఇంటర్వూలకు హాజరుకాగ 97 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు కళాశాల ప్రెసిడెంట్ రంగారావు, ప్రిన్సిపల్ విజయాదేవిలు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు తరగతిలో బోధించే విద్యతో పాటు జీవితంలో రాణించే విధంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం వి ద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.