రైలుకిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
– తాండూరు..రుక్మాపూర్ పట్టాల మద్య ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: రైలుకిందపడి ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన తాండూరు రైల్వే పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు రుక్మాపూర్ మార్గంలో కిలో మీటర్ నెంబర్ 75/29 వద్ద దాదాపు 25 ఏండ్ల వయస్సు ఉన్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గుర్తుతెలియని రైలుకింద పడి మృతి చెందినట్లు అనుమానించారు. మృతుని ఒంటిపై పసుపు రంగు టీషర్టు, నలుపు రంగు జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మార్చురికి తరలించారు. మృతుని ఆచూకీ తెలిస్తే రైల్వే పోలీసులు సెల్ : 9440700035కు సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు కె సు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.



