వైభవంగా కాళికాదేవి జాతర ఉత్సవాలు

తాండూరు రాజకీయం వికారాబాద్

వైభవంగా కాళికాదేవి జాతర ఉత్సవాలు
– ద‌ర్శించుకున్న నేత‌లు, భ‌క్తులు
– భ‌క్తుల‌కు అన్న‌దానం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు పట్టణంలోని ప్రసిద్ధ కాళికాదేవీ ఆలయంలో ఆషాడ మాస జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆదివారం అషాడ బొనాల జాతర వేడుకల సందర్భంగా ఆలయంలో వెలసిన కాళికాదేవి అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేశారు. జాతర సందర్భంగా భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

భక్తుల కిట కిటతో ఆలయం సందడిగా మారింది. ఆషాడ మాసం సందర్భంగా మహిళ భక్తులు బోనాలతో ఆలయానికి ఊరేగింపుగా తరలివచ్చారు. భక్తులు బోనాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అంత‌కుముందు అదేవిధంగా ఆలయ ఈఓ నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలకు తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమళ్, టీపీసీసీ ఉపాధ్య‌క్షులు ర‌మేష్ మ‌హ‌రాజ్, పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్, బీసీ సంఘం క‌న్విన‌ర్ కందుకూరి రాజ్ కుమార్, కాంగ్రెస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు ప్ర‌భాక‌ర్ గౌడ్, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు ఉత్త‌మ్ చంద్, జ‌నార్ద‌న్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు బంటు వేణు, నియోజ‌క‌వ‌ర్గ కార్య‌ద‌ర్శి కావ‌లి సంతోష్‌ తదితరులు హాజరై ఆల‌య డైరెక్ట‌ర్లు భ‌ద్రు, ఆకుల బ‌బ్లూల‌తో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేశారు.

మరోవైపు అనంతరం ఆలయంలో ప్రతి యేడాది మాగిరిగానే నిర్వహించిన రంగం కార్యక్రమం ఆకట్టుంది. మరోవైపు రేపు సోమవారం అమ్మవారి పల్లకి సేవ ఊరేగింపుతో జాతర ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ తాడెం నరేందర్ తెలిపారు. ఈ కార్య‌క్రమాల్లో ముదిరాజ్ సంఘం తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు ఎస్పి రవికాంత్, పట్టణ అధ్యక్షులు అల్లాపూర్ శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి రాము ముదిరాజ్, రమేష్ టైలర్, అమ్రేష్, గిర్జాపురం రమేష్, పిటి రాజు, హరి, బాతుల వెంకట్, శ్రీనివాస్, ఇందూరు వెంకట్, యువజన సంఘం సభ్యులు, భ‌క్తులు పాల్గొన్నారు.