అగ్ని ప్రమాదంతో రూ. 60లక్షల ఆస్తినష్టం

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

అగ్ని ప్రమాదంతో రూ. 60లక్షల ఆస్తినష్టం
– నిర్దారించిన కరణ్‌ కోట్ బ్యాంకు మేనేజర్
– కరణ్‌ కోట్‌ పోలీసులకు ఫిర్యాదులో స్పష్టం
– లాకర్లు మినహా, ఏమేం కాలిపోయాయంటే..?
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం కరణ్‌ కోట్ బ్యాంకులో సంబంవించిన అగ్ని ప్రమాదం భారీ ప్రమాదంగా మారింది. మంగళవారం ఉదయం బ్యాంకులో మంటలు చెలరేగి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కరణ్ కోట్ బ్యాంకు కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంను తెలుసుకున్న కరణ్ కోట్ పోలీసులు, జిల్లా ఫైర్ ఆఫీసర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి, ఏఎస్ఐఐ పవన్ లు సిబ్బందితో కలిసి మంటలను అదుపుచేసేందుకు సహకరించారు.

మంటలను అదుపు చేసిన తరువాత ప్రమాదంపై అంచనా వేశారు. ఈ మేరకు బ్యాంకు మేనేజర్ భువన్ మోహన్ మాట్లాడుతూ బ్యాంకులో ఫర్నీచర్, 6 కంప్యూటర్లు, సీలింగ్ ఫ్యాన్లు, ఏసీ, బ్యాటరీలు, సీసీ కెమెరాలు కాలిపోయాయని వెల్లడించారు. లాకర్లలో ఉన్న బంగారం, నగదు, ఇతర డాక్యుమెంట్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, అవి సురక్షితంగా ఉన్నాయని వివరించారు. షాక్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని భావిస్తున్నామన్నారు. ఈ ప్రమాదంలో బ్యాంకులో పూర్తిగా రూ. 60లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని వివరించారు. ఈమేరకు పోలీసులకు, ఫైర్ అధికారులకు అందించిన నివేధికలో స్పష్టం చేశారు. మరోవైపు మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు.

ఇది కూడా చదవండి….

జై.. భద్రేశ్వర స్వామి..!