కుర్చీ ఎట్లా దిగ‌రో చూస్తాం..!

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

కుర్చీ ఎట్లా దిగ‌రో చూస్తాం..!
– దీపా న‌ర్సింలును గ‌ద్దెనెక్కిస్తాం
– ఎన్నిక‌ల్లో బీఫారాలు ఇచ్చింది ఎమ్మెల్యేనే
– ఎమ్మెల్సీ.. మాయ‌ను వీడి మాట నిల‌బెట్టుకోవాలి
– మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : రెండున్నరేళ్ల ఒప్పందం కట్టుబడి చైర్ పర్సన్ పదవికి స్వప్న పరిమళ్ కుర్చి దిగిపోవాలని, లేదంటే ఎట్లా దిగ‌రో చూస్తామ‌ని.. తీవ్ర‌ప‌రిణాలు ఎదుర్కొక త‌ప్ప‌ద‌ని తాండూరు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వ‌ర్గీయుల‌ నేతలు పేర్కొన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ నివాసంలో పార్టీ పట్టణ‌ అధ్యక్షులు అప్పూ(నయూం) సమక్షంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రాజుగౌడ్ తదితరులు మీడియాతో స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావుల సమక్షంలో లిఖితపూర్వక ఒప్పందం జరిగిందని గుర్తుచేశారు. గడువు తీరాకా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మరో అవకాశం కింద రెండు రోజుల గడువు ఇచ్చినా కూడ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ రాజీనామా చేయకపోవడంపై అగ్రహం వ్యక్తం చేశారు. మాట మీద నిలబడే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై ఏం మంత్రం వేశారో.. అర్థం కావడం లేదన్నారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సైతం ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే విలువను పోగొట్టుకున్నట్లే అన్నారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా బీఫారాలు పొంది గెలిచాక చైర్ ప‌ర్స‌న్, కౌన్సిల‌ర్లు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చెప్పే లాక్ డౌన్ అంశాన్ని సాకుగా చూపించడం పద్ధతికాదన్నారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి వచ్చారని ప్రచారం చేయడాన్ని ఖండిస్తూ రోహిత్ రెడ్డి 2008 నుంచే టీఆర్ఎస్ జెండాను మోశారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచినా తాండూరు అభివృద్ధి కోసం టీఆర్ఎస్‌లో చేరారని అన్నారు. ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం తగదన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్, పార్టీ అధిష్టానంను కలిసి చైర్ పర్సను కుర్చి దించితీరుతామని, చైర్ పర్సన్ స్థానంలో పద్దోళ్ల దీపా నర్సింలును గద్దెనెక్కించి తీరుస్తామని అన్నారు.

చైర్ భర్త ప‌రిమ‌ళ్‌పై విమ‌ర్శ‌లు
మరోవైపు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తన భర్తపై కేసులు పెట్టించారని చేసిన విమర్శలను టీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేశారు. మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ పరిమళ్ గుప్తను వడ్డీ వ్యాపారిగా పోల్చారు. అధికార ప్రతినిధి రాజుగౌడ్ పరిమళ్ గుప్తది ఖండకావరమన్నారు. ఆయన వేధింపులతోనే అధికారులు విధులకు రాకుండా పారిపోతున్నారని, గన్నుతో బెధింరిస్తే సిబ్బంది ఆత్మహత్యాయత్నాలకు పాల్పడతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, దేవాలయాల చైర్మన్లు బంటారం సుధాకర్, రాజన్ గౌడ్, సంజీవరావు, పట్టణ ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, సంతోష్ గౌడ్, ఉపాధ్యక్షులు హరిగౌడ్, ప్రచార కార్యదర్శి సాగర్ గౌడ్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు నీరటి హన్మంతు, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, ఉర్దూఘర్ మాజీ చైర్మన్ అబ్దుల్ సలీం, యువనాయకులు ఈర్షాద్, చంటి యాదవ్, ఇంతియాజ్, శివానంద్ తదితరులు పాల్గొన్నారు.