జర్నలిస్టు పిల్లల ఫీజుల్లో రాయితీ
– డీఈఓలకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి సబితారెడ్డి
– కృతజ్ఞతలు తెలిపిన జర్నలిస్టు యూనియన్లు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: జర్నలిస్టుల పిల్లల చదువుల ఫీజులో రాయితీ కల్పించే విషయంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సానుకూలత వ్యక్తం చేశారు. రాయితీ వర్తించేలా డీఈఓలకు అదేశాలు చేశారు. సోమవారం టీయూడబ్ల్యూజే(ఐజేయూ) వికారాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి ఆధ్వర్యంలో జర్నలిస్టులు మంత్రి సబితారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల చెల్లింపుల్లో రాయితీ కల్పించే విధంగా చూడాలని కోరారు. ఇందుకు మంత్రి సబితారెడ్డి స్పందించి వెంటనే ఆయా జిల్లాల డీఈఓలకు ఆదేశాలను జారీ చేశారు. జర్నలిస్టుల పిల్లల ఫీజుల చెల్లింపు రాయితీలో డీఈఓలపై బాధ్యత ఉందని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నట్లు జిల్లా యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ చారితో పాటు సీనీయర్ జర్నలిస్టులు గిరీష్, రఘు, సంజీవ్, పలువురు జర్నలిస్టులు మంత్రి సబితారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజేయూతో పాటు వివిధ జర్నలిస్టు యూనియన్ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.



