దేశంలో, రాష్ట్రంలో ద‌గా పాల‌న

తాండూరు రాజకీయం వికారాబాద్

దేశంలో, రాష్ట్రంలో ద‌గా పాల‌న
– అంతం చేసేందుకు కాంగ్రెస్ ఉద్యమం
– తాండూరులో ద్వ‌జ‌మెత్తిన కాంగ్రెస్ నేత‌లు
– కేంద్ర‌, రాష్ట్రాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా దగాకోరు పాలన చేస్తున్నాయని తాండూరు కాంగ్రెస్ నాయకులు ద్వజమెత్తారు. శుక్రవారం టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు తాండూరు పట్టణం, మండల కాంగ్రెస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు బోయ అశోక్, ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్, సీనీయర్ నాయకులు హేమంత్ కుమార్ తదితరులు పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశంలో ఆర్థిక మాంద్యం, నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు, జీఎస్టీ పెంపు, నిరుద్యోగం, అగ్నిపథ్‌పై నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్రం బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎనిమిదేళ్లుగా ఇష్టారాజ్య పాలన చేస్తున్నాయన్నారు. ఇటీవల భారీ వర్షాలతో రైతులు పంటలను నష్టపోతుంటే వారిని ఆదుకోవడంలో ఎలాంటి శ్రద్ధ వహించడంలేదన్నారు. అదేవిధంగా కేంద్రం ఇష్టారాజ్యంగా ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను గద్దె దించడమే కాంగ్రెస్ ల‌క్ష్యంగా ఉద్య‌మిస్తోంద‌న్నారు. టీపీసీసీ అధ్య‌క్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనను అంతమొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు మోహన్, రాములు, బూతుల వెంకటయ్య, మైనార్టీ నాయకులు నవాజ్, ఖయ్యూం, ఎ స్ఎన్ఎయూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాజ్, పట్టణ అధ్యక్షులు ఎబినేజర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.