హిందూ ఉత్సవ సమితికి సహాకారం
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– ఎమ్మెల్సీని సన్మానించిన హిందూ ఉత్సవ సమితి
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని తాండూరు హిందూ ఉత్సవ సమితి సభ్యులు సన్మానించారు. హిందూ ఉత్సవ సమితి కార్యవర్గంలో ఇటీవలే సమితి గౌరవాధ్యక్షులుగా రాజుగౌడ్, అధ్యక్షురాలుగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ప్రధాన కార్యదర్శిగా పట్లోళ్ల నర్సింలు నియామకం అయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ హిందూ ఉత్సవ సమితికి తమవంతు సహాకారం ఉంటుందని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు కౌన్సిలర్లు రాము, వెంకన్నగౌడ్, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


