రేణుక ఎల్లమ్మ వైభోగం..!
– భక్తిశ్రద్ధలతో శ్రావణ మాస భజన సమాప్తి
– దర్శించుకున్న ప్రజా ప్రతినిధులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం నెహ్రు గంజ్‌లో వెలసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో శ్రావణ శోభ సంతరించుకుంది. శుక్రవారం శ్రావణమాసం ముగింపు, భజన సమాప్తి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను పురస్కరించుకుని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయం వద్ద భజన సమాప్తి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పలువురు ప్రముఖులు కూడ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, సంగీత ఠాకూర్, బాలప్ప, గంజ్ అసోసియేషన్ అధ్యక్షులు పటేల్ రాంరెడ్డి, వ్యాపారులు, హమాలి సంఘం, భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



