మీ నమ్మకాన్ని నిలబెట్టెకుంటా..!
– మంత్రి సబితారెడ్డిని కలిసిన రాజుగౌడ్
– ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలకు కృతజ్ఞతలు
– గ్రంథాలయ చైర్మన్‌ను అభినందించిన మంత్రి, ఎమ్మెల్యేలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమించడం పట్ల నమ్మకాన్ని నిలబెట్టేలా నడుచుకుంటానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలతో రాజుగౌడ్ పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియామకం కావడం పట్ల ఆదివారం హైదాబాద్‌లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిలను రాజుగౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు. తనకు గ్రంథాలయ చైర్మన్‌గా పదవిని అప్పగించడం పట్ల సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలు రాజుగౌడ్‌ను అభనందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదవిని గౌరవం తెచ్చేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పెద్దేముల్ మండల అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్, భద్రేశ్వరాలయ చైర్మన్ బంటారం సుధాకర్, యువనాయకులు విజయ్ కుమార్, అబ్దుల్ సలీం, ఈర్షాద్, ఇంతియాజ్ తదితరులు ఉన్నారు.


