బంపర్ రికార్డు సాధించిన తాండూరు బల్దియా
– విద్యుత్ శాఖ నుంచి రూ. 11 లక్షల 30 వేలు వసూలు
– మొండి బకాయిలు రికవరీతో రాష్ట్రస్థాయి ఘనత
తాండూరు, దర్శిని ప్రతినిధి: విద్యుత్ శాఖ నుంచి మొండి బకాయిలను వసూలు చేయడంలో తాండూరు మున్సిపల్ రాష్ట్రాస్థాయి రికార్డును సాధించింది. ఆ శాఖ నుంచి తాండూరు మున్సిపల్‌కు బకాయిలు పడిన రూ. 11లక్షల 30 వేల 950లను రికవరి చేసి ఈ ఘనత పొందింది. విద్యుత్ శాఖ నుంచి భారీ మొత్తంలో బకాయిలను వసూలు చేసిన దాఖలాలు లేవని అధికారులు పేర్కొంటున్నారు. అయితే తాండూరులో గతంలో విద్యుత్ బిల్లులు పెండింగ్ లో ఉంటే మున్సిపల్‌కు విద్యుత్ కనెక్షన్‌ను తొలగించిన విద్యుత్ శాఖ నుంచి మున్సిపల్ అధికారులు బకాయిలను వసూలు చేయడం విశేషం. విద్యుత్ శాఖ అధికారుల సహాకారంతోనే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భారీ మొత్తంలో బకాయిలు రికవరీ చేయడం జరిగిందని మేనేజర్ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ బకాయిలను విద్యుత్ ఏఈ, జేఏఓలు అధికారులకు అందజేశారు. మరోవైపు విద్యుత్ శాఖ నుంచి రూ. 11.30 లక్షల వసూళ్లను సాధించిన యంత్రాంగాన్ని తాండూరు ఆర్డీఓ, ఇంచార్జ్ కమిషనర్ అశోక్ కుమార్ అభినందించారు.


