తెలంగాణ ధీశాలీ చాకలి ఐలమ్మ
– జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్
– వర్దంతిలో నివాళులు అర్పించిన నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రజల ధీశాలీ చాకలి ఐలమ్మ అంటూ వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అభివర్ణించారు. శనివారం తాండూరు పట్టణం వీవీహెచ్ఎస్ పాఠశాల సమీపంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ వర్దంతిలో రాజుగౌడ్ హాజరయ్యారు. సంఘం ప్రతినిధులు, నేతలతో కలిసి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుఊత బడుగు బలహీన వర్గాల కోసం, దుక్కి దున్నే వాడిదే భూమి అనే నినాదంతో భూస్వాములకు, రజాకార్ల అఘాయిత్యాలకు, ఆగడాలకు అడ్డుకట్ట వేసిన చిట్యాల ఐలమ్మ సంపన్న వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగంచేసిన మహనీయురాలు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆదర్శమూర్తి.. గొప్ప ధీశాలీ అని, ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి, మాజీ కౌన్సిలర్లు సుమిత్ గౌడ్, అరవింద్, రజక సంఘం నాయకులు పి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


