గెస్ట్ లెక్చరర్ పోస్టుకు ఆహ్వానం
– ప్రకటించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాజమోహన్ రావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాలలో ఉర్దూ మీడియంలో ఫిజిక్స్ బోధించుకుంటకు ఈ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 16వ తేది సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను సమర్పించాలన్నారు. పీజీలో 50శాతం లేదా ఆపై ఉత్తీర్ణత ఉన్నవారే అర్హులని, అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ పత్రాలుతో దరఖాస్తును సమర్పించాలని సూచించారు.


