బంజార భవన్ ఏర్పాటు చారిత్రాత్మకం

తాండూరు రాజకీయం వికారాబాద్

బంజార భవన్ ఏర్పాటు చారిత్రాత్మకం
– గిరిజనుల గౌరవాన్ని పెంచిన కేసీఆర్
– తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : గిరిజనుల ఆత్మగౌరవం పెంచేలా బంజార భవన్ ఏర్పాటు చారిత్రాత్మకమని తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. శనివారం హైదరాబాద్ బంజార హిల్స్‌లో రూ. 25 కోట్లతో బంజార భవన్ ప్రారంభోత్సవంలో చైర్మన్ విఠల్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. దేశంలో ఎక్కడా లేని విధంగా బంజార భవన్ నిర్మించడం ఎంతో గర్వకారణమన్నారు. సీఎం కేసీఆర్ గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచారని అన్నారు. సీఎం కేసీఆర్‌కు గిరిజనులు. నాయకులు రుణపడి ఉంటామన్నారు. విఠల్ నాయక్ వెంట కౌన్సిలర్ భీంసింగ్, కోఆప్షన్ సభ్యులు వెంకట్రామ్ నాయక్, సర్పంచ్ శ్రీను నాయక్, ఎస్టీ సెల్ అధ్యక్షులు దేవేందర్ నాయక్, మాజీ ఎంపీపీ రాజు నాయక్, మాజీ సర్పంచ్ బాలు నాయక్, రెడ్యా నాయక్ తదితరులు ఉన్నారు.