పెరిగిన ధరలు, నిరుద్యోగాన్ని నిర్మూలించాలి

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

పెరిగిన ధరలు, నిరుద్యోగాన్ని నిర్మూలించాలి
– పేదలకు ఉచితంగా నిత్యవసర వస్తువులు అందించాలి
– వెల్పేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు కమల్ అతహర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశంలో ధరలు, నిరుద్యోగం పెరిగి పోయిందని, వాటి నియంత్రణ.. నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని వెల్పేర్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కమల్ అతహర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో పెరిగిపోతున్న ధరలు, దౌర్జన్యం, దోపిడి, నిరుద్యోగ నిర్మూలన కోసం వెల్పేర్ పార్టీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఈనెల 15 నుంచి ఆకలి రాజ్యం నిరుద్యోగ భారతం పేరుతో జాతీయ స్థాయి ఉద్యమం చేపట్టిందన్నారు. దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగ నియంత్రణకు ఆయా ప్రభుత్వాలు విఫలం అయ్యాయని అన్నారు. ప్రధాని మోడి ప్రతి యేడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మొండి చూపించారని విమర్శించారు. రాష్ట్ర ంలో నిరుద్యోగ భృతి అందించడం లేదన్నారు. అదేవిధంగా నిత్యవసర ధరలు పెరగడంతో ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని.. జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు. దారిద్య రేఖకు దిగువ ఉన్న పేపదలకు ఉచితంగా నిత్యవసర సరుకులను అందించాలన్నారు. దినసరి కూలీలు పట్టణాల్లో రూ. 500లు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 200లకు పెంచాలన్నారు. అర్హులైన బీద కుటుంబాలకు ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన క్రింద ఉచితం గ్యాస్ అందించాలని, నిరుద్యోగ యువతకు కుల మతాలకు అతీతంగా నిరోద్యోగ భృతి అందించాలన్నారు. పెరుగుతున్న ధరలు. అవినీతి, దోపిడి, దౌర్జన్యాలను అరికట్టాలని డిమాండ్ చేయాలన్నారు. ఇందుకోసం వెల్పేర్ పార్టీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉద్యమిస్తుందని, ఇందులో అందరు భాగస్వాములై దేశ ప్రగతికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వెల్పేర్ పార్టీ ఆఫ్ ఇండియా తాండూరు మండల అధ్యక్షులు హిదాయత్ ఉల్లా షరీఫ్ ఉన్నారు.