దైవ స్మరణలతోనే ప్రాప్తి
– జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్
– అయ్యప్ప అఖండ భజనలో పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: భజనలతో దైవ స్మరణ చేయడం వల్ల అందరికి దైవ ప్రాప్తి సిద్ధిస్తుందని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని అయ్యప్ప నగర్ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో అఖండ భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అఖండ భజనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ భక్తి.. భజనలతో దైవప్రాప్తితో పాటు మానసిక ఆరోగ్యాన్ని ప్రసాధిస్తాయన్నారు. అందరు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి సభ్యులు కేశవ రెడ్డి, జైపాల్ రెడ్డి, మనోహర్ యాదవ్ తదితరులు ఉన్నారు.

