ముదిరాజ్, బీసీలకు పెద్దపీట వేయాలి..!
– బుయ్యని శ్రీనివాస్‌రెడ్డితో నీలం మధు భేటీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : అన్ని రంగాల్లో బీసీలు, ముదిరాజ్‌లకు పెద్ద పీట వేయాలని కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డిని పటాన్ చెరువు కాంగ్రెస్ నేత, బీసీ ముద్దు బిడ్డ నీలం మధు కోరారు. ఆదివారం తాండూరుకు వచ్చిన ఆయన స్థానిక కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా పలు రాజకీయ, వ్యాపార విషయాలు చర్చించుకున్నారు.
తాండూరు నియోజకవర్గంలో ముదిరాజులు, బీసీ జనాభా అత్యధికంగా ఉన్నారని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ప్రభుత్వ తరపున ముదిరాజులు, బీసీలు రంగాల్లో రాణించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఇందుకు స్పందించిన శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నియోజక వర్గంలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు.
పలు పదవుల్లో బీసీలను, ముదిరాజులను నియమించిన అంశాలను గుర్తుచేశారు. బీసీలకు, ముదిరాజులకు అన్ని రంగాల్లో రాణించేలా సహాకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, నీలం మధు గారి మిత్ర బృందం, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

