టీఆర్ఎస్‌ తిరుగులేని గెలుపు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

టీఆర్ఎస్‌ తిరుగులేని గెలుపు..!
– పైలెట్ రోహిత్ రెడ్డి ప్రచారమే కీలకం
– తాండూరు టీఆర్ఎస్ నేతల హర్షం
– మునుగోడు ఉప పోరు విజయంపై సంబరాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు జాతీయ రాజకీయాలకు మునుగోడు ఎన్నికల ఫలితాలు తిరుగులేని విజయాన్ని అందించాయని తాండూరు గులాబీ నేతలు అన్నారు. ఆదివారం మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపొందడంపై తాండూరులో అట్టహాసంగా సంబరాలు జరుపుకున్నారు. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం) ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాలలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున టపాసులు పేల్చి నినాదాలతో హోరెత్తించారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి జిందాబాద్‌లు పలికారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ఫలించలేదన్నారు. ఎమ్మల్యే కొనుగోలు వ్యవహరంలో తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కేంద్రం కుట్రను బద్దలు కొట్టారని అన్నారు. మునుగోడు ఉప పోరులో పైలెట్ రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ గెలుపుకు కృషి చేశారని, తాండూరు అభివృద్ధికి సైతం పాటుపడుతున్నారని అభివర్ణించారు. మునుగోడు ఉప పోరులో టీఆర్ఎస్ విజయం జాతీయ రాజకీయాలకు తిరుగులేని గెలుపును అందించిందని అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో కూడ ప్రజలు సీఎం కేసీఆర్ వైపు నిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షులు, న్యాయవాది గోపాల్, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్ చారీ, యువనాయకులు ఈర్షాద్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.