వేస‌విలో ఉల్లి మేలు

ఆరోగ్యం తాండూరు తెలంగాణ వికారాబాద్

వేస‌విలో ఉల్లి మేలు
– ప‌చ్చి ఉల్లితో ప్ర‌యోజ‌నాలు
ద‌ర్శిని డెస్క్ : ఉల్లి చేసే మేలు త‌ల్లికూడ చేయ‌ద‌ని తెలుగు సామేత‌. ప్రతి ఇంట్లో ఉల్లిపాయ‌లు ఉంటాయి. దాదాపు ఇవి లేనిదే ఏ వంట చేయరు. అంతేకాదు ఇందులో యాంటీ-అలెర్జీ, యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-కార్సినోజెనిక్ వంటి లక్షణాలు ఉంటాయి. అందుకే వేసవిలో కొంతమంది వీటిని పచ్చిగా కూడా తింటారు. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. వేసవిలో ఉల్లిపాయ పచ్చిగా తినడం వల్ల చాలా ప్రయోజనాలు| ఉంటాయి. ముఖ్యంగా ఉల్లిపాయ మిమ్మల్ని వేడి స్ట్రోక్ నుంచి రక్షిస్తుంది. పచ్చి ఉల్లిపాయ ప్రభావంలో చల్లగా ఉంటుంది. ఇది మీ శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. అధిక వేడి నుంచి రక్షిస్తుంది. ఉల్లిపాయ నుంచి పొందే మ‌రిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. మీరు ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయను తింటే అది దంతాల బ్యాక్టీరియాని, చిగుళ్ళ సమస్యను తొలగిస్తుంది. ఉల్లిపాయ నోటి ఆరోగ్యానికి చాలా మంచిది.
2. మ‌హిళ‌లు పీరియడ్స్ సమస్యల నుంచి బయటపడేందుకు ఉల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ సమయంలో ఉల్లిపాయ తింటే మంచిది.
3. శీరరంలో ఇది చక్కెరను నియంత్రించడంతో పాటు, రక్త ప్రసరణను మెరుగ్గా చేస్తుంది.
4. ఉల్లి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. అందువల్ల ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయలను తినాలి.
5. ఉల్లిపాయలో ఎముకలు బలహీనపడకుండా నిరోధించే గుణాలు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవ‌డం వ‌ల్ల బోలు ఎముక‌ల వ్యాధిని నియంత్రించ‌వ‌చ్చు.
6. ఉల్లిపాయ‌లో ఉండే విట‌మిన్ ఏ,సీ,కేల నుంచి చ‌ర్మం తేమ‌గా మారుతుంది. దీంతో చ‌ర్మం కాంతివంత‌గా, తేమ‌గా ఉంటుంది.

గ‌మ‌నిక‌: మాకు ల‌భించిన అధ్యాయాల ద్వారా స‌మాచారాన్ని అందించ‌డం జ‌ర‌గుతుంది. నిర్ణ‌యాలు తీసుకునే ముందు వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం మంచింది.