కార్మికులను పావుల్లా వాడుకోవద్దు

తాండూరు రాజకీయం వికారాబాద్

కార్మికులను పావుల్లా వాడుకోవద్దు
– స్వార్థ రాజకీయాలకు చరమగీతం పాడాలి
– పీఆర్పీ కోసం కార్మికులకు అండగా ఉంటాం
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి: పారిశుద్ధ్య కార్మికులను పావుల్లా వాడుకోవద్దని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ద్వజమెత్తారు. పీఆర్సీ అమలు కోసం గత 10 రోజులుగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు చేపడుతున్న సమ్మెకు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మద్దతు తెలిపారు. సోమవారం కార్మికుల సమ్మె శిబిరానికి చేరుకుని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులతో కొందరు నాయకులు, అధికారులు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. వారిని పావుల్లా వాడుకుని పబ్బం గుడుపుతున్నారని మండిపడ్డారు. స్వయంగా మున్సిపల్ చైర్‌ పర్సనే సమస్యలపై ఇన్‌వార్డులో ఫిర్యాదు చేసే దుస్థితి ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. అన్ని ఉన్న అల్లుడి నోట్ల శని అన్నట్లుగా కార్మికులకు సమ్మె చేసే గతి పట్టడం విడ్డూరమన్నారు. కార్మికులతో రాజకీయాలు చేస్తున్న కుట్రలకు చరమ గీతం పాడాలన్నారు. కార్మికులకు సమస్యలు నెరవేరే వరకు వారికి అండగా ఉంటామన్నారు. ఇప్పటికైనా పారిశుద్ధ్య కార్మికులతో స్వార్థ రాజకీయాలు మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వెంకన్న గౌడ్, బోయరవి, నాయకులు దావులయ్య, మున్సిపల్ ఏఐటీయూసీ కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.