త్వరగా తాండూరు వస్తా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

త్వరగా తాండూరు వస్తా..!
– ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోండి
– తాండూరు నేతలతో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: సీఎం కేసీఆర్ ఆదేశాల తరువాత త్వరలోనే తాండూరకు వస్తానని.. అప్పటి వరకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పార్టీ నేతలతో పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వద్ద టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్‌తో కలిసి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో భేటి అయ్యారు. ఈ సందర్భంగా అఫ్పూ(నయూం) ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని శాలువాతో సత్కరించి.. పుష్పగుచ్చం అందించి.. స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అఫ్పూతో తాండూరు పరిస్థితులపై ఆరా తీశారు. రాజకీయ పరిణాలు ఏవిధంగా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందే తాండూరు ప్రజల సంక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ ఆదేశాల తరువాత తాండూరుకు వస్తానని, అప్పటి వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పనిచేస్తామని.. ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అఫ్పూ పేర్కొన్నారు.