టీఆర్ఎస్ బలోపేతంలో కీలకపాత్ర పోషించాలి
– సోషల్ మీడియా తాండూరు కన్వినర్‌గా టైలర్ రమేష్
– నియామకపత్రం అందజేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: టీఆర్ఎస్ పార్టీ బలోపేతంలో సోషల్ మీడియా విభాగం కీలకపాత్ర పోషించాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియా తాండూరు నియోజకవర్గ కన్వినర్‌గా పట్టణానికి చెందిన యువనాయకులు టైలర్ రమేష్ నియామకం అయ్యారు. సోమవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి టైలర్ రమేష్ కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు అనుబంధ కమిటి కృషి చేస్తున్నాయన్నారు. అందులో సోషల్ మీడియా విభాగం పార్టీ బలోపేతానికి మరింత కీలకంగా పనిచేయాలన్నారు. సర్కారు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి నిరంతరం ప్రజలను చైతన్య పర్చాలన్నారు. అనంతరం కన్వినర్‌గా నియామకం అయిన టైలర్ రమేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా కృషి చేస్తానని అన్నారు. నాయకులందరి సహాకారంతో పార్టీ అభివృద్దికి పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువనాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

